'జాన్‌ బోల్టన్‌ ఓ యుద్ధ పిపాసి': ఉత్తరకొరియా

SMTV Desk 2019-05-28 16:46:59  John Bolton

ప్యాంగ్‌యాంగ్‌: ఉత్తరకొరియా అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ఓ యుద్ధ పిపాసి మండిపడింది. ఉత్తరకొరి యాలో అలజడి సృష్టించేందుకు బోల్టన్‌ కుట్ర పన్నాడని ఆదేశ విదేశాంగ శాఖ తెలిపింది. అంతేకాక ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగకుండా బోల్టన్‌ అడ్డుపుల్లలు వేస్తున్నారని విమర్శించింది. అలాగే ఉత్తరకొరియాపై తప్పుడు నివేదికలు రూపొందించి అధ్య క్షుడు ట్రంప్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొంది. దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునే చర్యల్లో భాగంగా క్షిపణి పరీక్షలు నిర్వహించామని ఉత్తరకొరియా స్పష్టం చేసింది. అమెరికాపై ఒత్తిడి పెంచాలనే ఉద్దేశం తమకు లేదని వెల్లడించింది. బోల్టన్‌ ఉత్తరకొరియాపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపింది. ట్రంప్‌కు జాతీయ భద్రతా సలహాదారుగా బోల్టన్‌ లాంటివారుంటే ప్రమాదమని ఉత్తరకొరియా హెచ్చరించింది.