ఇండియాలో తగ్గిపోతున్న ఇంటర్నెట్ స్పీడ్‌

SMTV Desk 2019-05-28 16:36:38  internet speed

మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌లో భారత్ ర్యాంకు నానాటికీ తీసికట్టుగా మారుతోంది. గతేడాది 109వ ర్యాంకులో ఉంటే.. ఈ ఏడాది 121వ ర్యాంకుకు పడిపోయింది. ఓక్లా అనే స్పీడ్ టెస్ట్ కంపెనీ రూపొందించిన రిపోర్ట్ ప్రకారం.. భారత్‌లో మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ 10.71 ఎంబీపీఎస్‌గా ఉంది. 2018లో బ్రాండ్ బ్యాండ్‌లో 67వ స్థానం కాగా.. మొబైల్ స్పీడ్‌లో 109వ ర్యాంకులో ఉంది.

ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవల్లో 65.41ఎంబీపీస్‌ డౌన్లోడ్ స్పీడ్‌తో నార్వే తొలిస్థానంలో ఉండగా, బ్రాండ్ బ్యాండ్ విషయంలో 197.50 ఎంబీపీఎస్‌ డౌన్లోడ్ స్పీడ్‌తో సింగపూర్ టాప్ ప్లేస్‌లో ఉంది. స్పీడ్ తగ్గడానికి భారత్‌లోని భౌగోలిక పరిస్థితులు కూడా ఓ కారణమంటున్నారు ఓక్లా కంపెనీ అధికారులు. ప్రతి నెలా స్పీడ్ టెస్టులు నిర్వహిస్తామని.. మొత్తం 8 లక్షలకు పైగా టెస్టులు నిర్వహించినట్టు తెలిపారు.