రెండు కర్బూజాల విలువ రూ.32 లక్షలు....వైరల్ స్టొరీ

SMTV Desk 2019-05-28 16:05:08  water melons

జపాన్ లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. రెండు కర్బూజా పళ్లకు వేలంలో ఓ మనిషి వాటిని భారీ ధరకు కొన్నాడు. పూర్తి వివరాల ప్రకారం...యుబారీ జాతికి చెందిన ఈ పళ్లను వేలం వేయగా 45,600 డాలర్లకు (దాదాపు రూ.32 లక్షలు)కు అమ్ముడబోయాయి. బంగారంతో చేసినవి కాకపోయినా వీటికి ఒక ప్రత్యేకత ఉంది. తొలి సీజన్‌లో పండిన వీటిని తింటే నాలుకపై స్వర్గం కొలువుదీరుతుంది. తియ్యగా, మాటల్లో చెప్పలేని అనుభూతి వస్తుందట. వేసవిలో చక్కని ఎండ, పొడి వాతావరణంలో కళ్లలో వత్తులు వేసుకుని మరీ వీటిని పండిస్తారు. ఒక్కోటి గరిష్టంగా అరకేజీ నుంచి 5 కేజీలు తూగుతుంది. కోసుకుని తినడమే కాకుండా, వీటితో జ్యూస్ చేసుకుని, డ్రైఫూట్స్ వంటికి కలుపుకుని తాగుతారు. ఐస్‌క్రీమ్‌తో వేస్తారు.