మరో మెడికల్ విద్యార్ధిని బలవన్మరణం

SMTV Desk 2017-08-27 13:55:04  narayana college, medical student, suside, gadwal,

హైదరాబాద్ ఆగస్ట్ 27: హైదరాబాద్ మాదాపూర్ లోని నారాయణ కాలేజ్ లో విషాదం నెలకొంది. నారాయణ మెడికల్ అకాడమీలో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్ధిని అరుణ బలవన్మరణం చెందారు. గద్వాల్ కి చెందిన విద్యార్ధిని అరుణ సరిగ్గా చదవకపోవడంతో పాటు, ఒత్తిడి కూడా తోడవ్వడంతో తట్టుకోలేకపోతున్నానని .... సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ రూమ్ 201లో ఫ్యాన్ కి ఊరి వేసుకొని కనిపించడంతో తోటి విద్యార్ధులు చూసి కాలేజీ యాజమాన్యానికి తెలిపారు. అరుణను వెంటనే సమీపంలో ఉన్న హాస్పిటల్ కి తరలించినా లాభం లేకపోయింది, సూసైడ్ నోట్ ను స్వాదినం చేసుకున్న పోలీసులు. అరుణ మృతుదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరిలించారు.