టీమిండియా అభిమానుల మద్దతు కోరిన భువనేశ్వర్‌

SMTV Desk 2019-05-28 15:55:58  bhuvaneshwar kumar, icc world cup

లండన్‌: భారత స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ నిర్వహించే చాహల్‌ టీవీలో టీమిండియా అభిమానులకు భారత పేసర్ భువనేశ్వర్‌కుమార్‌ అభిమానుల మద్దతు కోరాడు. అయితే నేడు భారత జట్టు రెండో వార్మప్‌ మ్యాచ్‌ కోసం లండన్‌ నుంచి కార్డిఫ్‌ వెళ్తుండగా చాహల్‌ తన టీవీ షోని కొనసాగించాడు. ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు చాహల్‌ షోలో పాల్గొని ముచ్చటించారు. మరో రెండు రోజుల్లో ప్రారంభమయ్యే ప్రపంచకప్‌లో కచ్చితంగా మంచి ప్రదర్శన చేస్తామని, ఈ సందర్భంగా తమకు మద్దతుగా నిలవాలని భువీ టీమిండియా అభిమానులను కోరాడు. ఇక శిఖర్‌ధావన్‌ మాట్లాడుతూ ఐసీసీ ఈవెంట్లలో తన ప్రదర్శన గురించి ప్రస్తావించాడు. ఇంగ్లాండ్‌లో నేను ఆడేందుకు చాలా సంతోషిస్తున్నా. గతంలో వలే అనేక ఐసీసీ ఈవెంట్లలో పాల్గొని మంచి పరుగులు చేశా. గత విజయాలను స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రపంచకప్‌లో టైటిల్‌ సాధిస్తాం అని పేర్కొన్నాడు.ఇక వికెట్‌కీపర్‌ దినేశ్‌కార్తిక్‌ మాట్లాడుతూ చాహల్‌ టీవీలో మీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ షోలో పాల్గొనడం అంత తేలిక కాదు, చాలా పెద్ద విషయం అని చెప్పుకొచ్చాడు.