సొంత ఇల్లు కావాలంటే ఇందులో ఇన్వెస్ట్ చేయండి!

SMTV Desk 2019-05-28 15:50:59  mutual funds benefits

అందరికి సొంత ఇంటి సౌకర్యం కలిగి ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఎన్ని స్కీమ్స్‌ను ప్రవేశపెట్టినప్పటికీ కొంతమందికి సొంతిల్లు కలిగి ఉండాలనే కల నెరవేరడం లేదు. అయితే ఈ కలను సాకారం చేసుకోవడానికి ఒకే ఒక మార్గం అందుబాటులో ఉంది. అది ఇన్వెస్ట్ చేయడం. చాలా మంది పొదుపు చేయడం వల్ల కావాలసిన డబ్బుల్ని ఆదా చేస్తారు. అయితే ఈ ధనం ఇంటి కొనుగోలకు సరిపడకపోవచ్చు. అందుకే ద్రవ్యోల్బణాన్ని అధిగమించి రాబడి అందించే సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలి. దీనికి మంచి ఆప్షన్ మ్యూచువల్ ఫండ్స్. పదేళ్లలో రూ.50 లక్షల మొత్తాన్ని సంపాదించేందుకు ఒక వ్యక్తి నెలకు రూ.23,000 ఆదా చేయాల్సి ఉంటుందని ఫండ్స్‌ఇండియా.కామ్ కోఫౌండర్, సీవోవో శ్రీకాంత్ మీనాక్షి తెలిపారు. వార్షికంగా కనీసం 12 శాతం రాబడి వచ్చినా కూడా లక్ష్యాన్ని చేరుకోవచ్చని పేర్కొన్నారు. అదే 10 శాతం రాబడి అంచనా వేస్తే నెలకు రూ.25,000 ఇన్వెస్ట్ చేయాలని తెలిపారు.ఇన్వెస్టర్ 5 ఫండ్ స్కీమ్‌ను ఎంచుకోవాలని సూచించారు. ఇందులో నాలుగు ఈక్విటీ ఫండ్స్. ఒకటేమో డెట్ ఫండ్. ప్రతి నెలా వీటిల్లో ప్రతి ఒక్క దానిలో రూ.5,000 చొప్పున ఇన్వెస్ట్ చేయాలి. ఈక్విటీ ఫండ్స్‌లో ఒకటి లార్జ్ క్యాప్ ఫండ్, మరొకటి మల్టీ క్యాప్ ఫండ్, మిగతా రెండింటో ఒకటి మిడ్ క్యాప్, మరొకటి స్మాల్ క్యాప్ ఫండ్ అయ్యి ఉండాలి. డెట్ ఫండ్ అనేది లో రిస్క్ అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్ అయితే బాగుంటుంది.