ఫైనల్స్ కు సింధు, వెనుతిరిగిన సైనా

SMTV Desk 2017-08-27 13:43:14  PV Sindhu, BWF, Women singles, Saina Nehwal, World Badminton championship

గ్లాస్గో, ఆగస్ట్ 27: గత మూడు రోజులుగా గ్లాస్గో వేదికగా జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ లో సెమీస్ వరకు కలసిన నడచిన భారత ఏస్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధులలో సైనా వెనుదిరగాల్సి వచ్చింది. కాగా, సింధు మాత్రం ఫైనల్స్ కి అర్హత సాధించింది. ప్రపంచ నంబర్ 10 క్రీడాకారిణి అయిన చైనాకు చెందిన చెన్ యుఫీ‌తో సింధు తలపడగా 13-21, 10-21 తేడాతో గెలిచి ఫైనల్స్ కి దూసుకుపోయింది. దీంతో గత మ్యాచ్‌లలో కాంస్య పతకాలతో సరిపెట్టుకున్న సింధు, ఈ మ్యాచ్ లో స్వర్ణం లేదా రజతం అందుకోనుంది. శనివారం జరిగిన సెమీస్‌లో సైనా నెహ్వాల్, వరల్డ్ నంబర్ 12 క్రీడాకారిణి నోజోమి ఒకుహరా చేతిలో పరాజయం చవి చూసింది. ఇక సెట్స్ వివరాల్లొకొస్తే 12-21, 21-17, 21-10 తేడాతో ఓటమి పాలైంది. దీంతో సైనా నెహ్వాల్ కాంస్య పతకానికి పరిమితమైంది.