పరుగు పెడుతున్న ఇంధన ధరలు

SMTV Desk 2019-05-28 15:08:39  Petrol, Deseal, Price, New delhi

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుండి వరుసగా ఆరు రోజులు దేశీ ఇంధన ధరలు పెరుగుతూ పోతున్నాయి. ఈ మేరకు మంగళవారం కూడా ఇంధన ధరలు మరింత పైకి కదిలాయి. పెట్రోల్ ధర 10 పైసలు పైకి కదలగా డీజిల్ ధర కూడా 6 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్‌‌లో పెట్రోల్ ధర రూ.76.22కు చేరింది. డీజిల్ ధర రూ.72.53కు పెరిగింది. దేశంలోని ఇతర నగరాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు కూడా పైకి కదిలాయి. బ్రెంట్ క్రూడ్ దాదాపు 2 శాతం మేర ర్యాలీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 9 పైసలు పెరుగుదలతో రూ.71.86కు చేరింది. డీజిల్ ధర 5 పైసలు పెరుగుదలతో రూ.66.69కు ఎగసింది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా ధరలు ఇలానే పెరిగాయి. పెట్రోల్ ధర 9 పైసలు, డీజిల్ ధర 5 పైసలు ఎగసింది. దీంతో పెట్రోల్ రూ.77.47కు, డీజిల్ ధర రూ.69.88కు చేరింది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 10 పైసలు పెరుగుదలతో రూ.75.96కు చేరింది. డీజిల్‌ ధర 5 పైసలు పెరుగుదలతో రూ.71.87కు ఎగసింది. ఇక విజయవాడలో పెట్రోల్ ధర రూ.75.60కు పెరిగింది. డీజిల్ ధర రూ.71.55 వద్ద కొనసాగుతోంది.అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 1.94 శాతం పెరుగుదలతో 68.77 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.97 శాతం పెరుగుదలతో 59.20 డాలర్లకు ఎగసింది.