అనిల్ అంబాని వాటాల విక్రయాలు

SMTV Desk 2019-05-28 15:07:19  anil ambani, reliance communications, nclt

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబాని సారథ్యంలోని రిలయన్స్ గ్రూప్‌కు చెందిన రిలయన్స్ క్యాపిటల్ అండ్ రిలయన్స్ ల్యాండ్ తాజాగా రిలయన్స్ బ్రాడ్‌కాస్ట్ నెట్‌వర్క్‌లో వాటాలను పూర్తిగా జాగరణ్ ప్రకాశన్‌కు విక్రయిస్తోంది. డీల్ విలువ రూ.1,050 కోట్లు. ఇకపోతే రిలయన్స్‌ బ్రాడ్‌కాస్ట్‌ నెట్‌వర్క్‌ (ఆర్‌బీఎన్‌ఎల్‌) బిగ్‌ఎఫ్‌ఎం పేరుతో ఎఫ్‌ఎం చానళ్లను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దైనిక్‌ జాగరణ్‌ పేరుతో హిందీ దినపత్రికను ప్రచురించే జాగరణ్‌ ప్రకాశన్‌కు రేడియో సిటీ పేరుతో ఎఫ్‌ఎం చానళ్లను నిర్వహించే మ్యూజిక్‌ బ్రాడ్‌కాస్ట్‌ (ఎంబీఎల్‌) కంపెనీ ఉంది. దీని ద్వారా ఆర్‌బీఎన్‌ఎల్‌ను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది. ఇకపోతే మ్యూచువల్‌ ఫండ్స్‌ సేవల సంస్థ రిలయన్స్‌ నిప్పన్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌లో తన వాటాను మరో భాగస్వామి నిప్పన్‌ లైఫ్‌కు విక్రయించేందుకు ఇప్పటికే డీల్‌ కుదుర్చుకుంది. నిప్పన్‌ లైఫ్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌లో వాటా విక్రయం ద్వారా రిలయన్స్‌ క్యాపిటల్‌కు రూ.6,000 కోట్లు సమకూరతాయి.