టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు

SMTV Desk 2019-05-28 14:53:13  TRS MLC candidate, naveen rao,

తెలంగాణలో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో జరగనున్న ఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేసింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్‌రావును ఎంపిక చేస్తూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని గుత్తా సుఖేందర్‌రెడ్డి, నవీన్‌రావులకు కేసీఆర్‌ గతంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం ఒకటి మాత్రమే ఖాళీ ఏర్పడటంతో తొలుత నవీన్‌రావుకు అవకాశం కల్పించారు. త్వరలోనే ఖాళీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఓ చోట గుత్తాకు చోటు కల్పించనున్నట్లు సమాచారం అందుతుంది.

అదేవిధంగా మైనంపల్లి హనుమంతరావు మల్కాజిగిరి ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానంలో ఖాళీ ఏర్పడటంతో ఈసీ ఎన్నిక నిర్వహించనుంది.