అరుదైన ఘనతతో పాటు రూ. 1,280 కోట్లను కైవసం చేసుకున్న మేవెదర్

SMTV Desk 2017-08-27 13:17:58  Boxing, FLOYD MAYWEATHER , CONOR MCGREGOR , BOXING , BOUT

లాస్‌వేగస్, ఆగస్ట్ 27: తన ప్రొఫెషనల్ బాక్సింగ్‌కు రెండు సంవత్సరాల క్రితమే వీడ్కోలు పలికిన మేవెదర్, తాజాగా కానర్ మెక్ గ్రెగర్ తో తలపడి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. మేవెదర్ చివరిగా పకియావ్ పై గెలుపు సాధించాడు. అయితే తాజా గెలుపుతో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా 50 మ్యాచ్ లు గెలిచిన అరుదైన ఘనతను ఆయన సొంతం చేసుకున్నాడు. ఈ పోరులో సుమారు రూ. 1,700 కోట్ల ప్రైజ్ ప్రకటించగా, ఫ్లాయిడ్ మేవెదర్ సుమారు రూ. 1,280 కోట్లను కైవసం చేసుకున్నాడు. కాగా, పరాజయం పాలైన ప్రత్యర్థి గ్రెగర్ రూ. 400 కోట్లుతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. ఈ సందర్భంగా మేవెదర్ మాట్లాడుతూ, గ్రెగర్‌తో పోటీ అంత సులభం కాదని, తనని తక్కువ అంచనా వేశానని ఆయన తెలిపారు.