నెట్టింట్లో లీకైన "సైరా" డైలాగ్స్..!

SMTV Desk 2017-08-27 13:02:53  SAIRA NARASIMHAREDDY, MOVIE, DIOLOUGES LEAK, SOCIAL MEDIA

హైదరాబాద్, ఆగస్ట్ 27 : మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం "సైరా నరసింహారెడ్డి" చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ తేజ్ రూ.150 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రంలోని కొన్ని డైలాగులు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. వాటిలో "ఒరేయ్ నేను ఒట్టి చేతులతో వచ్చా, నువ్వు భుజం మీద తుపాకీతో వచ్చావ్.. అయినా నా చెయ్యి మీసం మీదకి పోయే సరికి నీ బట్టలు తడిసిపోతున్నాయిరా" అనే డైలాగ్ అభిమానులకు తెగ నచ్చేసింది. దీంతో శరవేగంగా షేర్ అవుతూ నెట్టింట్లో హల్ చల్ సృష్టిస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ లీకైన డైలాగ్స్ పై చిత్ర యూనిట్ ఇంతవరకు స్పందించకపోవడం విశేషం. ఏది ఏమైనా డైలాగ్స్ మాత్రం చాలా పవర్ ఫుల్ గా ఉండడంతో అభిమానులు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు.