వైస్ జగన్మోహన్ రెడ్డి కి శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా ..

SMTV Desk 2019-05-28 11:03:03  Jagan Mohan reddy,

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేశారు వైసీపీ అధినేత వైస్ జగన్మోహన్ రెడ్డి. ఈనెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఆయనకు రెండు రాష్ట్రాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో చాలా మంది ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మరికొందరు ప్లెక్సీలు ఏర్పాటుచేసి అభినందనలు తెలుపుతుండగా, కొందరు స్వయంగా కలిసి, సేవా కార్యక్రమాలు చేసి శుభాకాంక్షలు చెబుతున్నారు.

సామాన్యులు కూడా జగన్‌కు శుభాకాంక్షలు చెప్పడానికి ఓ వాట్సాప్ నంబర్ పెట్టారు. జగన్ అభిమానుల కోసం వైసీపీ 99127 90699 నెంబర్‌ను ప్రత్యేకంగా విడుదల చేసింది. ఆ నంబర్‌కి తమ శుభాకాంక్షలను వీడియో, ఆడియో లేదా రాత పూర్వకంగా తెలియజేయవచ్చు. పేరు, ఊరు పేర్కొనాలి. ఇదే సమయంలో అన్ని సాక్షి దినపత్రిక కార్యాలయాల్లో బాక్సులు ఉంచామని, శుభాకాంక్షలు రాసి అందులో వేయవచ్చని తెలిపింది.