200 రూపాయల నోట్లను ఏటీఎంల ద్వారా సరఫరా చేయం : ఆర్‌బిఐ

SMTV Desk 2017-08-27 12:15:13  RBI, 200 RUPEES NOTES, 50 NOTES, BANKS

ముంబై, ఆగస్ట్ 27 : ఇటీవల ఆర్‌బిఐ కొత్తగా చలామణిలోకి తీసుకువచ్చిన రూ. 200 నోట్ల కోసం ప్రజలు క్యూ కడుతున్నారు. ఈ నోట్లను ప్రస్తుతానికి కేవలం ఎంపిక చేసిన ఆర్‌బిఐ కార్యాలయాలు, బ్యాంకుల ద్వారా మాత్రమే అందిస్తున్నారు. ప్రజలు డబ్బు మార్చుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, కొత్తగా వచ్చిన రూ. 200తో ఈ కష్టాలు తీరుతాయని కేంద్రం భావిస్తోంది. దీంతో బ్యాంకుల వద్దకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. రానున్న రోజులలో ఈ నోట్ల సరఫరాను పెద్ద మొత్తంలో పెంచనున్నట్లు రిజర్వ్ బ్యాంకు వెల్లడించింది. ఈ నోట్లను ఏటీఎంల ద్వారా అందించే ఉద్దేశం తమకు లేదని ఆర్‌బిఐ స్పష్టం చేసింది. అంతేకాకుండా కొత్త రూపంతో మరిన్ని భద్రతా ఫీచర్లతో 50 రూపాయల నోటును కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.