హ్యాట్రిక్ వికెట్లు పడగొడతా: మలింగా

SMTV Desk 2019-05-27 18:34:07  malinga, srilanka

ప్రపంచకప్ టోర్నీలో హ్యాట్రిక్ వికెట్లు పడగొడతానని శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ అన్నారు. 2007 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2019 సీజన్‌లోనూ ముంబయి ఇండియన్స్ టీమ్‌ టైటిల్ గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించిన మలింగ.. ఇంగ్లాండ్‌ పిచ్‌ పేసర్లకి అనుకూలిస్తుందని చెప్పుకొచ్చాడు. 15 ఏళ్ల కెరీర్‌లో ఇప్పటికే 218 వన్డేలాడిన మలింగ.. 322 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 8 సార్లు ఐదుకిపైగా వికెట్లు పడగొట్టడం విశేషం. 35 ఏళ్ల ఈ యార్కర్ల స్టార్‌కి ఇదే చివరి ప్రపంచకప్‌ అయ్యే అవకాశముంది. ‘ప్రపంచకప్ 2019లోనూ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టేందుకు ప్రయత్నిస్తాను. ఒకవేళ హ్యాట్రిక్‌ సాధించగలిగితే.. అది నాకు చాలా ప్రత్యేకంకానుంది. ఇంగ్లాండ్‌లో ఆడటాన్ని నేను బాగా ఆస్వాదిస్తా. అక్కడి పరిస్థితులకి అలవాటుపడటం చాలా కీలకం. ఎందుకంటే.. ఆ గడ్డపై ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉంటాయి.. అలానే చలి తీవ్రత కూడా ఉంటుంది. ముఖ్యంగా.. బౌలర్లకి ఇది కఠిన పరీక్ష’ అని మలింగ వెల్లడించాడు.