గుర్మీత్ కేసులో కోర్టును జైలుకే తరలించిన సీబీఐ

SMTV Desk 2017-08-27 11:50:49  chandighad, gurmithsingh baba, court verdict, cbi.

చండీఘడ్, ఆగస్ట్ 27 : డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ సింగ్ బాబా అత్యాచార ఘటనలో రేపు శిక్ష ఖరారు చేయనుండగా, ఆయనను కోర్టుకు తరలించే నిమిత్తం బయటకు తీసుకువస్తే మరింత హింసకాండ జరగవచ్చని ఇంటెలిజెన్స్ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో హర్యానా ప్రభుత్వం ప్రస్తుతం ఆయన ఉన్న రోహ్ తక్ జైల్లోకే కోర్టును తరలించాలని నిర్ణయించింది. ఈ జైలులోనే ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి గుర్మీత్ సింగ్ ను అక్కడే హాజరుపరిచి తీర్పు వెల్లడించాలని సీబీఐ ఆలోచనలో ఉంది. ఇందుకోసం జైలులోని ఓ బ్యాకర్ ను ఖాళీ చేయించి అందులో కోర్టును ఏర్పాటు చేస్తున్నారు. పంజాబ్, హర్యానాల్లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ, ఇతర ప్రాంతాల్లో 144 సెక్షన్ లు అమలులో ఉండగా పంచశిల, సిర్సా ప్రాంతాల్లో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు అమలు చేస్తున్నారు. కాగా గుర్మీత్ సింగ్ తనపై అత్యాచారం చేశారని ఆరోపిస్తున్న యువతుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుండడం గమనార్హం. అయితే రేపు ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య ఈ తీర్పు వెలువడనుంది.