రూ.4,375 కోట్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి

SMTV Desk 2019-05-27 18:29:02  foreign investors

న్యూడిల్లీ: దేశీయ మూలధన మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు మే నెలలో ఇప్పటివరకు దాదాపు రూ.4,375 కోట్లు వెనక్కి తీసుకున్నారు.అంతర్జాతీయ, దేశీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని వారు టం పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. దీనికి ముందు ఏప్రిల్‌లో విదేశీ ఇన్వెస్టర్లు రూ.16,093 కోట్ల పెట్టుబడులను దేశీయ మార్కెట్లోకి పంపారు. అలాగే మార్చిలో రూ.45,981 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 11,182 కోట్లు పెట్టుబడులను మూలధన మార్కెట్లోకి (ఈక్విటీ, డెబిట్) జొప్పించారు. తాజా గణాంకాల ప్రకారం, మే 224 తేదీల్లో విదేశీ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పిఐ) ఈక్విటీల నుంచి రూ.2,048 కోట్లు, డెబిట్ మార్కెట్ల నుంచి రూ.2,309 కోట్లు ఉపసంహరించుకున్నారు. దీంతో మొత్తం రూ.4,375 కోట్లు వెనక్కి తీసుకున్నట్లైంది.