చైర్మన్ పదవికి దర్శకుడు కె.రాఘవేంద్రరావు రాజీనామా..

SMTV Desk 2019-05-27 18:28:12  raghvendra rao,

తిరుమల : ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు శ్రీవేంకటేశ్వరా భక్తిచానల్‌ (ఎస్‌వీబీసీ) చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. టిటిడి ఈ ఆధ్యాత్మిక చానెల్‌ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. 2015 నుంచి టిటిడి బోర్డు సభ్యుడిగా ఆయన కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఎస్‌విబిసి చానల్‌ కు చైర్మన్ గా వ్యవహరిస్తూ, ఈ చానల్ బాధ్యతలను చూస్తున్నారు. వయోభారం కారణంగా ఈ బాధ్యతలను సరిగా నిర్వహించలేకపోతున్నానని రాఘవేంద్రరావు తెలిపారు. అందుకే చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. టిటిడి యాజమాన్యానికి, సిబ్బందికి శ్రీవారి ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఇంతకాలం తనకు సహకరించిన టిడిపి యాజమాన్యం, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.