ప్రపంచకప్‌ జట్టులో పాండ్య కీలక ఆటగాడు: యువీ

SMTV Desk 2019-05-27 17:56:23  yuvraj singh, hardik pandya, icc world cup

టీంఇండియా తరపున మెగా టోర్నీలో ఆడుతున్న హార్దిక్ పాండ్యాపై 2011 ప్రపంచకప్‌ హీరో యువరాజ్‌సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ మరిన్ని విశేషాలు పంచుకున్నాడు. ఈ సారి ఆటలో కొన్ని మార్పులు చేశారు. ఐదుగురు ఫీల్డర్ల సర్కిల్‌(30 గజాలు)లో ఉండాల్సి ఉంది. కానీ గతంలో ఇక్కడ నలుగురే ఉండేవారు. తనకు ఇండియా జట్టుపై బాగా నమ్మకం ఉందని, ఎంతటి లక్ష్యాన్నైనా చేధించగలరని యువీ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ సారి ప్రపంచకప్‌ జట్టులో హార్ధిక్‌ పాండ్య కీలక ఆటగాడని యువీ తెలిపాడు. ప్రస్తుతం అతడు మంచి ఫామ్‌లో ఉన్నాడని, బ్యాట్‌తో పాటు బంతితో రాణిస్తున్నాడు. ఇక టాప్‌ఆర్డర్‌లో రోహిత్‌, కోహ్లి ,ధావన్‌ రాణిస్తే భారత్‌ మంచి స్కోర్లు సాధిస్తుందని యువరాజ్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు.