ఎంఐ డేస్ సేల్‌...స్పెషల్ ఆఫర్స్

SMTV Desk 2019-05-27 17:55:29  amazon mi day sale

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తో కలిసి చైనాకు చెందిన షావోమి మే 31 వరకు ఎంఐ డేస్ సేల్‌ నిర్వహిస్తోంది. ఎంఐ డేస్ ఐదు రోజుల సేల్‌లో భాగంగా కస్టమర్లకు రూ.5,500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. రెడ్‌మి వై3, రెమ్‌మి 7, రెడ్‌మి నోట్ 5 ప్రో, రెడ్‌మి 6ఏ వంటి పలు స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్చేంజ్ ఆఫర్ సదుపాయం కూడా ఉంది. షావోమి రెడ్‌మి 7 ధర రూ.7,999 నుంచి ప్రారంభమౌతోంది. 2 జీబీ ర్యామ్ వేరియంట్‌కు ఈ ధర వర్తిస్తుంది. 3 జీబీ ర్యామ్ ధర రూ.8,999. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుదారులు 5 శాతం తక్షణ తగ్గింపు పొందొచ్చు. రెడ్‌మి వై3 ధర రూ.9,999 నుంచి ప్రారంభమౌతోంది. రెడ్‌మి నోట్ 5 ప్రో ఫోన్ రూ.10,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. రెడ్‌మి 6ఏ ధర రూ.5,999 నుంచి, రెడ్‌మి వై2 ధర రూ.8,999 నుంచి ప్రారంభమౌతోంది. ఎంఐ ఏ2 ఫోన్‌ను రూ.11,999కే సొంతం చేసుకోవచ్చు.