కాకినాడని పారిశ్రామిక నగరంగా తీర్చిదిద్దుతాం : చంద్రబాబు నాయుడు

SMTV Desk 2017-08-26 19:24:24  AP Chief minister, Chandrababu naidu, Kakinada Corporation elections, Roadshow

కాకినాడ, ఆగస్ట్ 26: కాకినాడలోని స్థానిక నాగామల్లితోట జంక్షన్‌లో జరుగుతున్న కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఆయనతో పాటు బిజెపీ నేత ఎంపీ హరిబాబు కూడా ఉన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..."కాకినాడ నగరాన్ని భారతదేశంలోనే బ్రంహాండమైన నగరంగా తిర్చుదిద్దుతాం అని". కాకినాడ నగరానికి పోర్ట్ ని తీసుకొచ్చింది మా ప్రభుత్వమే,ఈ జిల్లాని పారిశ్రామిక నగరంగా తిర్చిదిద్దడమే తన తదుపరి లక్ష్యం అంటూ ఆయన ప్రకటించారు. ఈ నగరానికి పూర్వ వైభవం తెస్తామని, జాతీయ స్థాయి ఇన్‌స్టిట్యూట్‌లను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఈ స్థాయిలో అభివృద్ధి జరగాలంటే ఈ ఎన్నికల్లో టీడీపీ, బిజెపీ మేయర్ అభ్యర్దిని గెలిపిస్తేనే జరుగుతుందంటూ చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.