సగం ధరకే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్....!

SMTV Desk 2019-05-27 17:52:44  amazon prime subscription, vodafone

వొడాఫోన్ కస్టమర్లకు అమెజాన్ ఓ స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. సగం ధరకే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ పొందే అవకాశం అందుబాటులో తీసుకొచ్చింది. వొడాఫోన్ ప్రిపెయిడ్ కస్టమర్లు రూ.999 కాకుండా రూ.499కే పొందొచ్చు. ఈ ఆఫర్ జూన్ 30 వరకు అందుబాటులో ఉంటుంది. దీని పేరు వొడాఫోన్ యూత్ ఆఫర్ ఆన్ ప్రైమ్. ఈ ఆఫర్ పొందాలంటే వొడాఫోన్ సబ్‌స్క్రైబర్ల వయసు 18 నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుంటే కొత్త కొత్త సినిమాలతోపాటు, అమెజాన్‌లో కొనుగోలు చేసిన ప్రొడక్టులను త్వరితగతిన డెలివరీ పొందొచ్చు. అలాగే ఎక్స్‌క్లూజివ్ డీల్స్‌ను ముందుగానే పొందొచ్చు.