రణ్ వీర్ సింగ్ కొత్త చిత్రానికి జోర్దార్ టైటిల్

SMTV Desk 2019-05-27 17:44:06  ranveer

వరుస సినిమాలతో .. వరుస విజయాలతో రణ్ వీర్ సింగ్ దూసుకుపోతున్నాడు. విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ ఆయన ముందుకు వెళుతున్నాడు. ప్రస్తుతం ఆయన కపిల్ దేవ్ బయోపిక్ గా రూపొందుతోన్న 83 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత సెట్స్ పైకి వెళ్లడానికి ఆల్రెడీ మరో ప్రాజెక్టును ఆయన లైన్లో పెట్టేశాడు.

మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని అల్లిన కథాకథనాలతో ఈ సినిమా సాగుతుందట. ఈ సినిమాకి జయేశ్ భాయ్ - జోర్దార్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. దివ్యాంగ్ టక్కర్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. 83 మూవీ తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని రణ్ వీర్ సింగ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు