మార్కెట్లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలెక్ట్రిక్ బైక్

SMTV Desk 2019-05-27 16:22:04  royal enfield

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ కి మార్కెట్లో ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. ప్రధానంగా యూత్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌కు మంచి ఆదరణ ఉంది. అయితే ఈ కంపెనీ కూడా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తన బైక్స్‌లో కొత్త కొత్త ఫీచర్లను జోడిస్తూ వస్తోంది. డిస్క్ బ్రేక్స్, 2 ఛానల్ ఏబీఎస్, సెల్ఫ్ స్టార్టర్ వంటి వాటిని ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు తాజాగా కంపెనీకి చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్‌ మోడల్‌లో ఎలక్ట్రిక్ వెర్షన్ ఒకటి మార్కెట్‌లో హల్‌చల్ చేస్తోంది. థాయ్‌లాండ్‌లోని కంపెనీ అధికారిక షోరూమ్‌లో ఈ బైక్ కెమెరా కంటికి చిక్కింది. ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను కంపెనీ లాంచ్ చేయలేదు. ఇది కస్టమ్ బైక్. అయితే కంపెనీ ఇప్పటికే ఎలక్ర్టిక్ టూవీలర్ విభాగంలోకి ఎంట్రీ ఇస్తామని ప్రకటించింది. ఈ బైక్‌లో పెద్ద ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీని చూడొచ్చు. అలాగే ఇందులో ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ కూడా ఉంది. బ్యాటరీ హెల్త్ ఇండికేటర్, స్పింట్ టైమ్స్ వంటి ఫీచర్లను కూడా గమనించొచ్చు. అయితే ఇందులో ఎక్స్‌హాస్ట్ లేదు.