కాంగ్రెస్ పై పగ లేదు

SMTV Desk 2019-05-27 16:18:54  Jagan Mohan reddy, Congress

శత్రువును క్షమిస్తేనే శాంతి లభిస్తుందని వైసిపి చీఫ్, కాబోయే ఎపి సిఎం జగన్ పేర్కొన్నారు. ఆదివారం జగన్ ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎపి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సమయంలో తాను తన తండ్రి వైఎస్ ను తలుచుకున్నానని, నిజంగా అవి భావోద్వేగమైన క్షణాలు అని జగన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం పిలిస్తే మళ్లీ ఆ పార్టీలో చేరుతారన్న ప్రశ్నకు జగన్ సమాధానం ఇచ్చారు. తన విషయంలో కాంగ్రెస్ ఏం చేసిందో తనతో పాటు ప్రజలకు తెలుసునని, తాను పగ తీర్చుకోవాలనుకోవడం లేదని, దేవుడే వారిని శిక్షిస్తాడని జగన్ పేర్కొన్నారు. తనకు సంబంధించినంత వరకు కాంగ్రెస్ ను ఎప్పుడో క్షమించేశానని, శత్రువును క్షమిస్తేనే శాంతి లభిస్తోందని జగన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం ఎపిపై, ఎపి ప్రజల బాగోగులపై పెట్టానని ఆయన పేర్కొన్నారు. తనకు ఎవరితో వ్యక్తిగత శత్రుత్వం లేదని, కేవలం విధానపరమైన అంశాలపై తాను విబేధిస్తానని జగన్ చెప్పుకొచ్చారు.