జనాభా నియంత్రణపై బాబా రాందేవ్ వ్యాఖ్యలు.. 'మోదీ' ని వెటకారంగా ప్రస్తావించిన ఒవైసీ!

SMTV Desk 2019-05-27 16:11:48  modi

భారత్ లో విపరీతంగా జనాభా పెరిపోతోందనీ, దీన్ని అరికట్టాలంటే ఇద్దరికి మించి పిల్లలను కనకుండా చట్టం తీసుకురావాలని యోగా గురువు బాబా రాందేవ్ చెప్పిన సంగతి తెలిసిందే. మూడో బిడ్డ జన్మిస్తే అతనికి ఓటు హక్కు, ఇతర ప్రభుత్వ సౌకర్యాలు ఇవ్వరాదని ఆయన వ్యాఖ్యానించారు. దీనపై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యంగ్యంగా స్పందించారు.

‘ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైన వ్యాఖ్యలను నిలువరించేందుకు ప్రస్తుతం ఎలాంటి చట్టం లేదు. కానీ రామ్ దేవ్ వ్యాఖ్యలకు ఇంత ప్రాముఖ్యత ఎందుకు లభిస్తోంది? ఆయన పొట్టను, కాళ్లను కదిలిస్తూ మీడియా దృష్టిని ఆకర్షించవచ్చు. అంతేకానీ మూడో కొడుకు అయినందుకు ఇప్పుడు ప్రధాని మోదీ తన ఓటు హక్కును కోల్పోవాలా?’ అని ఒవైసీ వెటకారంగా ట్వీట్ చేశారు.