ఎండల తీవ్రతకు తూలిపడిన కడియం.

SMTV Desk 2017-06-03 14:35:36  dy cm, kadiyam srihari, warangal urban, dropdown

వరంగల్, జూన్ 3 : ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గలేదు..ఉదయం 7 గంటల నుండే ఎండల తీవ్రత విజృంభిస్తోంది. నడివయస్కులు, పెద్దవారు, రోగులు ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రత ఉపముఖ్యమంత్రిని సైతం వదల్లేదు...తీవ్రమయిన ఎండలో నిల్చోని ప్రసంగ పాఠం చదువుతు అస్వస్థతకు గురైయ్యారు. రక్తపోటు పడిపోయి సొమ్మసిల్లి పడిపోయారు.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా వేడుకలు హన్మకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించారు.కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వరంగల్ అర్బన్ జిల్లా ప్రగతిపై రూపొందించిన నివేదికను చదువుతూ ఒక్కసారిగా తూలిపడిపోయారు. తూలిపడిపోవడంతో గందరగోళం ఏర్పడింది. అక్కడ ఏం జరుగుతుందో తెలియక జనం అందోళనకు గురయ్యారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, శాసన సభ్యులు వినయ్ భాస్కర్, అధికారులు అంగరక్షకులు కడియం శ్రీహరిని వాహనం వద్దకు తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఆయనను విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయితే ఐదునిమిషాల తర్వాత కడియం శ్రీహరి మళ్ళీ వేదిక పైకి వచ్చి ప్రసంగం తిరిగి ప్రారంభించి పూర్తి చేశారు. తర్వాత వేదిక పై నుండి గ్యాలరీకి వెళ్ళి కూర్చున్నారు. అక్కడ వరంగల్ జిల్లా అర్బన్ వైద్యాధికారి హరీశ్ రాజ్ ఆధ్వ ర్యంలో పరీక్షలు నిర్వహించారు. ఎండలో ఉండి ప్రసంగం చదువాల్సి రావడం, ఉదయం నుంచి ఆహారం తీసుకోకపోవడం వల్ల లో బీపీ తో ఇలా జరిగిందని వైద్యులు వెల్లడించారు.