ఇండియాను పాక్ చిత్తు చేస్తుంది: ఇంజిమామ్‌

SMTV Desk 2019-05-27 15:56:29  pakistan, india, icc world cup 2019, Pakistan beats India in world cup says Pakistan chief selector inzamam

మే 30న ప్రారంభం కానున్న వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్తాన్ జట్టు ఇండియాను చిత్తు చేస్తుంది అని పాక్ టీమ్ చీఫ్ సెలక్టర్ ఇంజిమామ్‌ ఉల్ హక్ ధీమా వ్యక్తం చేశాడు. భారత్, పాక్ మ్యాచ్‌పై తాజాగా ఇంజిమామ్ మాట్లాడుతూ ‘దాయాదుల మ్యాచ్‌ని అభిమానులు చాలా సీరియస్‌గా తీసుకుంటారు. ప్రపంచకప్‌ కంటే ఈ మ్యాచ్‌లో గెలవడానికే వారు అధిక ప్రాధాన్యమిస్తారు. ప్రపంచకప్‌లో ఇప్పటి వరకూ భారత్‌పై పాక్ గెలవలేదు. కానీ.. ఈసారి భారత్‌కి ఓటమి రుచి చూపిస్తాం’ అని ధీమా వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్ వేదికగా 2017లో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో భారత్‌పై గెలిచి పాకిస్థాన్ విజేతగా నిలిచింది. తాజాగా ప్రపంచ‌కప్‌ కూడా అక్కడే జరగనుండటంతో.. పాక్‌ అదేరీతిలో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే.. ప్రపంచకప్ సన్నాహకంలో భాగంగా అఫ్గానిస్థాన్‌తో ఇటీవల జరిగిన వార్మప్ మ్యాచ్‌లో పాకిస్థాన్ చిత్తుగా ఓడగా.. న్యూజిలాండ్ చేతిలో పేలవంగా భారత్ పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే.