ఎస్‌బీఐపై ఫిర్యాదు చెయ్యాలా...అయితే ఇదే మంచి అవకాశం!

SMTV Desk 2019-05-27 15:52:20  state bank of india

ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) దేశవ్యాప్తంగా ఉన్న తన వినియోగదారుల కోసం ఈ నెల 28న ముఖాముఖి నిర్వహించనుంది. కస్టమర్లకు అందించే సర్వీసులను ఎలా మెరుగుపరుచుకోవాలి? సమస్యల పరిష్కారం ఎలా జరుగుతోంది? వంటి అంశాలు ఈ మీటింగ్ ప్రధాన అజెండా. కస్టమర్ మీట్‌లో భాగంగా ఎస్‌బీఐ ఏకంగా లక్ష మందితో సమావేశం కానుంది. దేశవ్యాప్తంగా 17 స్థానిక ప్రధాన కార్యాలయాల ద్వారా 500 ప్రాంతాల్లో బ్యాంక్ అధికారులు కస్టమర్లతో సమావేశం కానున్నారు. క్షేత్ర స్థాయిలో కస్టమర్లతో మమేకం కావాలని బ్యాంక్ కోరుకుంటోంది. బ్రాంచ్ స్థాయిల్లో మెరుగైన సేవలు అందించాలని చూస్తోంది. బ్యాంక్ సీనియర్ అధికారులు ఈ సమావేశానికి హాజరవుతారని ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్ (రిటైల్ అండ్ డిజిటల్) పి.కె.గుప్తా తెలిపారు. సమావేశంలో భాగంగా కస్టమర్లు బ్యాంక్ అధికారులతో వారి సమస్యల గురించి మాట్లాడొచ్చు. బ్యాంక్ ప్రొడక్టులు, సర్వీసుల గురించి అభిప్రాయాలను తెలియజేయవచ్చు. మెరుగైన సేవల కోసం సలహాలు కూడా ఇవ్వొచ్చు.