సృజనాత్మకత చూపించిన అభిమానులపై మండిపడ్డ కలెక్టర్ ఆమ్రపాలి

SMTV Desk 2017-08-26 18:01:13  Collector, IAS Amrapali Kata, Warangal, Social media, Youngest IAS officer

వరంగల్, ఆగస్ట్ 26: వైవిధ్యభరితంగా తమ అభిమానాన్ని వ్యక్తపరచిన ఖాజీపేట యువకులపై వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి నిప్పులు చెరిగారు. నిన్న వినాయక చతుర్థిని పురస్కరించుకుని ఖాజీపేటకు చెందిన యూత్ కలెక్టర్ ఆమ్రపాలి ఒడిలో వినాయకుడు ఉన్న విధంగా విగ్రహాన్ని ప్రతిష్టించారు. అయితే దీనికి సంబంధించిన ఫొటోలు కొద్ది సమయంలోనే సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. దీంతో విషయం ఆమె వరకు చేరడంతో తన ఒడిలో వినాయకుడిని పెట్టడం ఏంటని కలెక్టర్ మండిపడ్డారు. తక్షణం ఆ విగ్రహాన్ని తొలగించమని పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమాచారం తెలిసిన యువకులు పోలీసుల ప్రమేయం లేకుండానే స్వచ్ఛందంగా ఆ ప్రతిమకు నల్ల రంగు పూసి అక్కడ నుండి తరలించారు.