టీటీడీ ధర్మకర్తల కీలక మండలి సమావేశం

SMTV Desk 2019-05-27 15:48:09  ttd,

ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపధ్యంలో రేపు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరగనుంది. తెలుగుదేశం ప్రభుత్వం నియమించిన పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో మండలి కొనసాగుతోంది. రాష్ట్రంలో టీడీపీ అధికారం కోల్పోయి, వైసీపీ కొత్తగా పగ్గాలు చేపట్టనున్న నేపథ్యంలో మండలి కొనసాగింపుపై సందిగ్ధం నెలకొంది. అందుకే సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి ఇప్పటికే సమావేశం నిర్వహించాల్సి ఉండగా ఎన్నికల కోడ్‌ కారణంగా వాయిదా పడింది. తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వం కూడా మారిపోవడంతో నామినేటెడ్‌ పదవుల విషయంలో సందేహాలు నెలకొన్నాయి. ఇటువంటి సందర్భాల్లో స్వచ్చందంగానే చాలామంది పదవులు వదులుకుంటారు.

కాకపోతే టీటీడీ పదవులు సెంటిమెంట్‌తో కూడుకున్నవి కావడంతో సభ్యులెవరూ రాజీనామా చేయడానికి ఇష్టపడడం లేదట ఒక వేళ కొత్త ప్రభుత్వం తొలగించే వరకూ వేచి చూడాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. దీంతో రేపు సమావేశముందని టీటీడీ నుంచి సమాచారం అందగానే ఆదివారం రాత్రికే పలువురు సభ్యులు తిరుమల చేరుకున్నారు. ఇక సమావేశంలో తీసుకునే నిర్ణయాలు, మండలి భవితవ్యం ఏమిటన్నది త్వరలో తేలనుంది.