ముచ్చటగా మూడోసారి తేజు తో సై అన్న హాట్ భామ

SMTV Desk 2019-05-27 15:43:51  regina, Sai dhram tej,

వరుస ఫెయిల్యూర్స్ తర్వాత ’చిత్రలహరి’తో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్ తదుపరి మారుతి డైరెక్షన్‌లో సినిమాకు కమిట్ అయ్యాడు. ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రం తర్వాత మారుతి చేస్తున్న సినిమా ఇది. మళ్లీ తేజు సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు తగ్గట్లుగా స్క్రిప్టు ప్రిపేర్ చేసుకున్నాడు మారుతి. ఈ సినిమా కోసం తేజు బరువు తగ్గే పనిలో బిజీగా ఉన్నాడట. కాన్సెప్ట్‌కి తగ్గట్టుగా హీరో సిక్స్ ప్యాక్‌తో కనిపించాలి కాబట్టి తేజు జిమ్‌లో జోరుగా వ్యాయామాలు చేస్తున్నాడట. ఇప్పటికే రెగ్యులర్ వర్కవుట్స్‌తో చాలా వరకూ బరువు తగ్గాడట. తేజు మేకోవర్ పూర్తి కాగానే ఈ సినిమాను పట్టాలెక్కించనున్నాడు మారుతి.



ఇదిలా ఉండగా ఈ సినిమాలో అందాల భామ రెజీనా నటించబోతోందంటూ గాసిప్ ఒకటి చక్కర్లు కొడుతోంది. తేజు,రెజీనా లది బెస్ట్ కాంబినేషన్. గతంలో పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాల్లో ఈ ఇద్దరూ కలిసి నటించారు. ఈ రెండూ తేజు కెరీర్‌లో సూపర్ హిట్ సినిమాలు. కాబట్టి ఓ వైపు సెంటిమెంట్ వర్కవుటవుతుంది, మరోవైపు క్యారెక్టర్ పరంగా రెజీనా అయితే బావుంటుందని చిత్రయూనిట్ యోచిస్తోందట. దీంతో రెజీనాను ఈ సినిమా కోసం తీసుకున్నారట. అయితే రెజీనా ఈ సినిమాలో పూర్తి స్థాయిలో కనిపించదట. నిడివి తక్కువ ఉన్న పాత్ర ఆమెది అని తెలిసింది. ఇక ప్రస్తుతం రెజీనా బాలీవుడ్‌లో బిజీగా గడుపుతోంది.