ఎవ‌రు చేయాల‌నేది వారు నిర్ణ‌యిస్తారు: లారెన్స్‌

SMTV Desk 2019-05-27 13:13:36  raghava lawrence, kanchana 3 release, maharshi

తెలుగు, త‌మిళంలో విజ‌య‌వంత‌మైన కాంచ‌న‌ సినిమాకు బాలీవుడ్ రీమేక్ లక్ష్మీబాంబ్‌ . అక్ష‌య్ కుమార్ న‌టిస్తున్నారు. ఈ సినిమా లారెన్స్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభ‌మైంది. అయితే త‌న ప‌ర్మిష‌న్ లేకుండా సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేయ‌డంతో లారెన్స్‌కు కోపం వ‌చ్చింది. అంతే కాకుండా త‌న‌కు గౌర‌వం ఇవ్వ‌లేదంటూ.. గౌర‌వం ద‌క్క‌ని చోట తాను ఉండ‌లేనంటూ లారెన్స్ ప్రాజెక్ట్ నుండి ప‌క్క‌కు త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌ట‌న ఇచ్చారు. అయితే త‌న అభిమానుల‌తో పాటు, అక్ష‌య్‌కుమార్ అభిమానులు లారెన్సే రీమేక్‌ను తెర‌కెక్కించాల‌ని రిక్వెస్ట్‌లు పెడుతున్నార‌ట‌. దీనిపై లారెన్స్ ట్విట్ట‌ర్ వేదిక స్పందించారు.

"నేను ల‌క్ష్మీబాంబ్‌ సినిమా నుండి త‌ప్పుకున్నాను. అయితే అక్ష‌య్ సార్‌.. అభిమానులు, నా అభిమాలు ట్వీట్స్ పెడుతున్నారు. న‌న్నే డైరెక్ట్ చేయ‌మంటున్నారు. లక్ష్మీబాంబ్ సినిమా కోసం నా డేట్స్ కేటాయించాను. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌పై దృష్టి పెట్టాను. నేను సినిమా నుండి త‌ప్పుకొన్నాన‌ని మీరెంత బాధ‌ప‌డుతున్నారో, నాకు మ‌ర్యాద ఇవ్వ‌నందుకు నేనూ అంతే బాధ‌ప‌డుతున్నాను.

ఈరోజు(ఆదివారం) న‌న్ను క‌ల‌వ‌డానికి నిర్మాత‌లు చెన్నై వస్తున్నారు. సినిమాను ఎవ‌రు డైరెక్ట్ చేయాల‌నేది వారు నిర్ణ‌యిస్తారు. నా ప‌నిని వారు గౌర‌విస్తే.. నేను ప్రాజెక్ట్ చేయాలా? వ‌ద్దా? అని ఆలోచిస్తాను. నా కోసం తాప‌త్ర‌యం ప‌డుతున్న అభిమానుల కోసం ఈ మెసేజ్ చేస్తున్నాను" అన్నారు రాఘ‌వ లారెన్స్‌.