వేశ్య పాత్ర‌లో పాయ‌ల్‌ రాజ్‌పుత్‌

SMTV Desk 2019-05-27 12:54:22  anushka

RX 100 చిత్రంలో ఒక ప‌క్క హాట్ అందాలు, లిప్ లాక్ సీన్స్‌లో రెచ్చిపోయిన పాయ‌ల్ రాజ్‌పుత్‌. మ‌రో ప‌క్క పెర్ఫామెన్స్ ప‌రంగా కూడా ఆకట్టుకుంది. సినిమా పెద్ద హిట్ కావ‌డంతో పాయ‌ల్ రాజ్‌పుత్‌కు వ‌రుస అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి. అయితే పాయ‌ల్ సినిమాల ఎంపిక‌లో ఏమాత్రం తొంద‌ర‌ప‌డలేదు. మంచి పాత్ర‌ల‌ను ఎంచుకోవ‌డానికే ఎక్కువ ప్రాధాన్య‌త‌ను ఇచ్చింది.

ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు సి.క‌ల్యాణ్ నిర్మాణంలో భానుశంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఉమెన్ సెంట్రిక్ మూవీలో న‌టిస్తుంది. అలాగే డిస్కోరాజాలో బ‌ధిర యువ‌తిగా, వెంకీ మామ‌లో వెంక‌టేష్ జ‌త‌గా న‌టిస్తుంది. ఇవి కాకుండా ఓ బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఓ బ‌యోపిక్‌లో న‌టించ‌నుంది. 1970-80 కాలంలో రాబిన్ హుడ్‌గా పేరు పొందిన గ‌జ‌దొంగ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు జీవిత‌క‌థ‌ను ఆధారంగా చేసుకుని టైగ‌ర్ అనే సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నారు.

ఈ చిత్రంలో ఇద్ద‌రు హీరోయిన్స్ న‌టిస్తారు. అందులో ఒక‌రు నిధి అగ‌ర్వాల్ అయితే.. మ‌రో హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పుత్‌. ఈ చిత్రంలో పాయ‌ల్ వేశ్య పాత్ర‌ను పోషించ‌నున్నారు. ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె ఈ విష‌యాన్ని తెలిపారు. ద‌ర్శ‌కుడు పాత్ర‌ను వివ‌రించిన‌ప్పుడు ఛాలెంజింగ్‌గా అనిపించ‌డంతో వేశ్య పాత్ర‌లో న‌టించ‌డానికి పాయ‌ల్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట‌.