విదేశాలకు వెళుతుంటే.... విమానాన్ని వెనక్కు రప్పించి....బలవంతంగా కిందకు దించారట

SMTV Desk 2019-05-27 12:40:53  jet airways

జెట్ ఎయిర్‌ వేస్ వ్యవస్థాపకుడు, నెల రోజుల క్రితం సంస్థకు దూరమైన నరేశ్ గోయల్‌ కు ఘోర అవమానం ఎదురైంది. తన భార్య అనితతో కలిసి దుబాయ్ వెళ్లేందుకు ఆయన ముంబై నుంచి బయలుదేరగా, ఇమిగ్రేషన్ అధికారులు ఆయన్ను బలవంతంగా విమానం దించారు. తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయి, గత నెల 17 నుంచి ఒక్క విమాన సర్వీసునూ నడపని సంస్థకు దాదాపు రూ. 15 వేల కోట్ల వరకూ అప్పులు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఆయన దుబాయ్ కి బయలుదేరగా, విమానం కదిలిన తరువాత, ఆయన ఉన్నారన్న విషయాన్ని తెలుసుకుని, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి పైలట్‌ కు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చి, విమానాన్ని వెనక్కు రప్పించి, గోయల్ దంపతులను కిందకు దించారు. ఈ ఘటనపై స్పందించేందుకు జెట్ ఎయిర్‌ వేస్ నిరాకరించడం గమనార్హం.