బద్రీనాథ్‌కు అంబానీ రూ.2 కోట్ల విరాళం..

SMTV Desk 2019-05-27 12:03:11  Ambani, badrinath,

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ శనివారం ఉత్తరాఖండ్‌లోని ప్రఖ్యాత బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయ కమిటీకి రెండు కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. అంబానీకి బికెటిసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి బిడి సింగ్ ధర్మాధికారి, ఆఫీసర్ భువనచంద్ర ఉనియాల్ తదితరులు ఆలయం వద్ద సాదరంగా స్వాగతం పలికారు. బద్రీనాథ్ ఆలయంలో పూజలు జరిపిన ముకేశ్ దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. గర్భాలయంలో భగవద్గీత ప్రవచనాలను కూడా శ్రద్ధగా ఆలకించారు. తన తండ్రి ధీరూభాయ్ అంబానీ పేరుతో తమిళనాడులోని శాండిల్‌వుడ్ ఆయలంలో భూమి కొనుగోలుకు కూడా ముకేశ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కూడా బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలను సందర్శించిన విషయం తెలిసిందే.