ఇంగ్లాండ్ ను మట్టి కరిపించిన కంగారులు

SMTV Desk 2019-05-26 17:17:01  england, australia,

ప్రపంచకప్‌ హాట్‌ఫేవరెట్‌ ఇంగ్లాండ్‌ను వార్మప్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 12 పరుగుల తేడాతో ఓడించింది. మొదట ఆస్ట్రేలియా సీనియర్ బ్యాట్స్ మెన్ స్మిత్‌ (115) శతకం సాయంతో ఆసీస్‌ 9 వికెట్లకు 297 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ 49.3 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటైంది. విన్స్‌ (64), బట్లర్‌ (52), వోక్స్‌ (40) రాణించారు. బెరెన్‌డార్ఫ్‌ (2/43), కేన్‌ రిచర్డ్‌సన్‌ (2/51) ప్రత్యర్థికి కళ్లెం వేశారు.