స్మృతి ఇరానీ ముఖ్య అనుచరుడి దారుణ హత్య

SMTV Desk 2019-05-26 17:16:21  smiti irani

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథిలో బీజేపీ నేత స్మృతి ఇరానీ సహచరుడు సురేంద్ర సింగ్‌ను శనివారం రాత్రి దుండగలు కాల్చిచంపారు. బరౌలియా గ్రామ ప్రధాన్‌గా పనిచేసిన సురేంద్ర సింగ్.. బీజేపీ నేత స్మృతి ఇరానీకి అత్యంత సన్నిహితుడు. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా స్మృతి ఇరానీతో కలిసి సురేంద్ర నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. అమేథి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీపై స్మృతి ఇరానీ గెలుపొందిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం కావడం గమనార్హం.

సురేంద్ర సింగ్ శనివారం రాత్రి ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర గాయాలపాలైన సురేంద్ర అపాస్మారక స్థితిలో పడి ఉన్న సింగ్‌ను కుటుంబ సభ్యులు తెల్లవారు జామున 3గంటలకు గుర్తించి, వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సురేందర్ హత్యతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు భారీ ఎత్తున్న బలగాను మోహరించారు. కాగా ఈ హత్య పాతకక్షలా? లేదా రాజకీయ విభేదాలతో జరిగిందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.