ఎయిర్ టికెట్ల పై మిత్రా యాప్‌లో పది శాతం రాయితీ

SMTV Desk 2019-05-26 17:14:05  Air tickets,

దేశీయ మార్గాల్లో ప్రయాణానికి రూ.899 నుంచి ఆఫర్ టికెట్లను విక్రయించనున్నట్లు గో ఎయిర్ ప్రకటించింది. జూన్ 15 నుంచి డిసెంబర్ 31 మధ్య ప్రయాణం కోసం అందుబాటులో ఉండేలా 10లక్షల టికెట్లను ఈ నెల 27నుంచి మూడు రోజుల పాటు విక్రయించనున్నట్లు తెలిపింది. కనీసం రూ.2499 లావాదేకి పేటిఎం వాలెట్ ద్వారా చెల్లిస్తే రూ.500 నగదు వెనక్కి ఇస్తామని తెలిపింది. అలాగే కనీసం రూ.1999 లావాదేవీకి మిత్రా యాప్‌లో పది శాతం రాయితీ ఉంటుంది. జూమ్ కార్ ద్వారా బుక్ చేసుకుంటే 1500 రూపాయలు లేదా 20 శాతం రాయితీ లభిస్తుంది. ఫాబ్‌గో ఎయిర్ కూపన్ కోడ్ వాడితే 40 శాతం వరకు రాయితీ అదనంగా మరో 25 శాతం వరకు ధరలో తగ్గింపు ఉంటుందని తెలిపింది.