ఒక్క అవకాశం ఇవ్వండి అనే మాట ఇంతటి గొప్ప విజయం అందించింది

SMTV Desk 2019-05-26 17:07:21  Ganta Srinivas rao, Jagan,

విశాఖ ఎమ్మెల్యే ప్రముఖ రాజకీయ నాయకుడు గంటా శ్రీనివాసరావు వైసీపీ విజయం పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు.

గత ఎన్నికల్లో గెలిచినప్పుడు చాలా కష్టతర పరిస్థితుల్లో రాష్ట్రం ఉందని అప్పటికే 15వేల కోట్ల లోటు బడ్జెట్ తో ఈ రాష్ట్రం ఉందని అయినా సరే చంద్రబాబు చాలా సమర్ధవంతంగా ఎన్నో అభివృద్ధి పనులు ఇక్కడ చేసారని చెప్పుకొచ్చారు.కానీ ఏపీ ప్రజలు మాత్రం ఈసారి వారి తీర్పును వేరే విధంగా ఇచ్చారని.జగన్ కోరినట్టుగా ఏపీ ప్రజలు మార్పును కోరుకున్నారని,జగన్ మరియు ఇతర వైసీపీ శ్రేణులు అంతా ప్రజల్లోకి తీసుకెళ్లిన ఒక్క అవకాశం ఇవ్వండి అనే మాట జగన్ కు ఇంతటి గొప్ప విజయాన్ని అందించిందని తెలిపారు.మొత్తానికి వైసీపీకి ప్రజలు అందించిన ప్రజా తీర్పును తాము శిరసావహిస్తామని తాను నిర్వహించిన ఒక ప్రెస్ మీట్ లో తెలియజేసారు.