సీన్స్ వాడుకుంటే కబడ్ధార్

SMTV Desk 2019-05-26 17:05:52  Bala, Vikram

చియాన్ విక్రం తనయుడు ధ్రువ్ హీరోగా తెలుగులో సూపర్ హిట్టైన అర్జున్ రెడ్డి రీమేక్ మూవీ సెట్స్ మీద ఉన్న విషయం తెలిసిందే. బాలా డైరక్షన్ లో వర్మ గా తెరకెక్కిన ఆ సినిమా అవుట్ పుట్ బాగాలేదని దాన్ని మొత్తం తీసి మళ్లీ కొత్త డైరక్టర్ అర్జున్ రెడ్డి మాత్రుక దర్శకుడు సందీప్ వంగ దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా చేసిన గిరీశయ్య డైరక్షన్ లో మళ్లీ షూటింగ్ మొదలు పెట్టారు.

సినిమాలో హీరో ధ్రువ్ తప్ప మిగతా వారందరిని మార్చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఆదిత్య వర్మ టైటిల్ పెట్టి సినిమా మొదలు పెట్టిన 3 నెలల్లోనే సినిమా షూటింగ్ పూర్తి చేశారట. అయితే సినిమా ఇంత త్వరగా పూర్తి చేయడంతో ఎందుకో డౌట్ వచ్చిన డైరక్టర్ బాలా తను షూట్ చేసిందంతా డిలీట్ చేశామని అన్నారు.. ఒకవేళ అందులో సీన్స్ వాడుకుంటే మాత్రం చట్టపరమైన చర్య తీసుకోవాల్సి ఉంటుందని అటు విక్రంకు.. నిర్మాణ సంస్థకు వార్నింగ్ ఇచ్చాడట.

అయితే గిరీశయ్య ఎంట్రీతో ఫుల్ కాస్ట్ అండ్ క్రూ మారారని తెలుస్తుండగా బాలా షూట్ చేసిన సీన్స్ వాడే అవకాశం లేదన్నది ఆదిత్య వర్మ యూనిట్ వాదన. ఏది ఏమైనా శివపుత్రుడు సినిమాతో హిట్ కొట్టిన బాలా, విక్రంలు ఇలా ఓ సినిమా విషయంలో తేడా రావడం మాత్రం తమిళ సిని ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది.