జూలైలో వ‌స్తున్న ఇస్మార్ట్ శంక‌ర్

SMTV Desk 2019-05-26 17:05:10  ismart shanker,

ఎన‌ర్జిటిక్ హీరో రామ్‌, డాషింగ్ డైరెక్టర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’. ‘డ‌బుల్ దిమాక్ హైద‌రాబాది’ అనేది ట్యాగ్ లైన్‌. ఇప్పటికే హైదరాబాద్, గోవాలో షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో భారీ యాక్షన్ సీన్స్ కూడా షూట్ చేసింది. ఇప్పటికే డిఫరెంట్ షేడ్‌లో ఉన్న రామ్‌ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇస్మార్ట్ శంకర్’ లో రామ్ .. హైదరాబాద్‌కు చెందిన డబుల్ దిమాక్ ఇస్మార్ట్ పోరడి పాత్రలో రఫ్పాడించాడు.

ప్రస్తుతం షూటింగ్ టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. జూలై 12న చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని టీం భావిస్తుంద‌ట‌. మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కతున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతమందిస్తున్నారు. ఎనర్జిటిక్‌ రామ్‌ హీరో స‌ర‌స‌న‌ నిధి అగర్వాల్‌, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు