వైరల్ అవుతున్న జగన్ సటైర్

SMTV Desk 2019-05-26 16:51:22  jagan

గత ఏప్రిల్ నెలలో జరిగిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మొన్న మే 23 న విడుదలయ్యాయి.అస్సలు ఎవ్వరు ఊహించని విధంగా జగన్ 150 స్థానాల్లో గెలుపొంది సత్తాను చాటాడు.జగన్ గెలుపు కన్నా తెలుగుదేశం పార్టీ ఓటమి మరీ ఘోరమని చెప్పాలి.175 స్థానాలకు పోటీ చెయ్యగా వారికి కేవలం 23 అసెంబ్లీ స్థానాలు మాత్రమే దక్కాయి. అలాగే ఎంపీ స్థానాల విషయానికి వస్తే మొత్తం 25కు గాను కేవలం 3 స్థానాలు మాత్రమే గెలుపొందారు.అయితే ఈ సారాంశం అంతటిపైనా జగన్ తెలుగు తమ్ముళ్లకు మైండ్ బ్లాక్ అయ్యే సెటైర్ వేశారు.

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఫలితాల తర్వాత మన ఎమ్మెల్యేలలో 23 మందిని మరియు ముగ్గురు ఎంపీలను డబ్బులకు ప్రలోభ పెట్టి వారి పార్టీలోకి లాక్కున్నారని కానీ దేవుడు వారికి ఎలాంటి పరిస్థితి తీసుకువచ్చారో అని చెప్తూ వారికి దిమ్మతిరిగే సెటైర్ వేశారు.గత ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ వారు మన ఎమ్మెల్యేలను 23 మందిని కొంటే అదేంటో ఆశ్చర్యంగా వారికి ఈసారి అదే 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారని అలాగే ముగ్గురు ఎంపీలకు గాను ఈసారి వారికి వచ్చింది కూడా ముగ్గురు ఎంపీలు మాత్రమే అని ఓ రేంజ్ లో సెటైర్ విసిరారు.ఈ వీడియో కానీ టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.