తిరుమల వెళ్లనున్న సీఎం కెసిఆర్

SMTV Desk 2019-05-26 16:50:04  KCR,

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల పర్యటనకు వెళ్తున్నారు. సాయంత్రం ప్రత్యేక విమానంలో అక్కడికి చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేసి.. రేపు ఉదయం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుంటారు. సోమవారం సాయంత్రం ఆయన తిరుమల నుంచి హైదరాబాద్‌కు వస్తారు.

అదేవిధంగా గతంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా శ్రీవేంకటేశ్వరస్వామికి మొక్కు చెల్లించేందుకు కేసీఆర్‌ తిరుమల వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా లోక్‌సభ ఎన్నికల తర్వాత స్వామి దర్శనార్థం వెళ్తున్నట్లు తెలుస్తోంది. అలాగే... ఈ నెల 29న సాయంత్రం సీఎం కేసీఆర్‌ సతీసమేతంగా విజయవాడకు బయల్దేరి వెళ్లనున్నారు. రాత్రి అక్కడే బస చేస్తారు. 30న కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదేరోజు మధ్యాహ్నం విజయవాడ మున్సిపల్‌ స్టేడియంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు కేసీఆర్.