మాజీ ఎమ్మెల్యే శారారాణి కన్నుమూత

SMTV Desk 2019-05-26 16:45:45  mla

పరకాల మాజీ ఎమ్మెల్యే బండారి శారారాణి అనారోగ్యంతో ఈ రోజు కన్నుమూశారు. ఆమె హైదరాబాద్‌లోని స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారు. శారారాణి 2004లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆమె టీడీపీ అభ్యర్థి దొమ్మటి సాంబయ్యను ఓడించారు. తర్వాత ఆమె పార్టీలో అసమ్మతి స్వరం వినిపించారు. కొన్నేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.