51 ఏళ్ల వయసున్న నటి...16 ఏళ్ల పడుచుపిల్లలతో కలిసి ర్యాంప్ వాక్...వైరల్ స్టొరీ

SMTV Desk 2019-05-25 22:22:40  stephanie siao

తైవాన్‌కు చెందిన స్టీఫీయాన సియావోకు ఇప్పుడు 51 సంవత్సరాలు కాని ఇప్పటికి 16 ఏళ్ల అమ్మాయిలా అందాన్ని మెయింటేన్ చేస్తూ ప్రపంచం మొత్తం తనవైపే చూసేలా చేసుకుంటుంది. సియావో 20 ఏళ్లుగా టీవీ సీరియల్స్‌లో నటిస్తూ పాపులర్ అయింది. 1989లో తైవానీస్ రొమాంటిక్ డ్రామా టీవీ సిరీస్‌లో లీడ్ రోల్ పోషించింది.1996లో వచ్చిన ఏ సర్టైన్ ఆఫ్ లవ్ డ్రీమ్ అనే టీవీ సిరీస్ ద్వారా ఫేమస్ అయ్యింది. ఏళ్లు గడుస్తున్నా వన్నె తరగని అందంతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. 344,000 మంది ఈమెకు ఫాలోయర్లు ఉన్నారు. మీ అందానికి కారణమేంటి.. మీ వయసు పెరుగుతుంది కానీ..మీ అందం తరగట్లేదేంటి అని సియావోని అడిగితే యోగానే నా బ్యూటీ సీక్రెట్ అని అంటోంది. 10 సంవత్సరాలుగా యోగా, స్విమ్మింగ్ చేస్తానంటోంది. ఇంకా కొద్ది సేపు తన పెంపుడు జంతువులతో ఆడుకుంటుంది. ఇక ఫుడ్ విషయానికి వస్తే ప్యూర్ వెజిటేరియన్. ఇదేనండి నా ఆరోగ్యం.. నా అందం అంటోంది. 1968లో పుట్టిన సియావో 16 ఏళ్ల పడుచుపిల్లలతో కలిసి ర్యాంప్ వాక్ చేసి అందరి చూపులు తనవైపు తిప్పుకుంటుంది.