అంతమాత్రానికే పాక్‌తో మ్యాచ్‌ని బహిష్కరిస్తారా.....అఫ్రిది

SMTV Desk 2019-05-25 22:12:31  shahid afridi, gautam gambhir, pulwama attack

టీంఇండియా మాజీ క్రికెటర్ నూతన రాజకీయ నాయకుడు గౌతమ్ గంభీర్ పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది. ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి వన్డే ప్రపంచకప్ మొదలుకానుండగా.. జూన్ 16న భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. అయితే.. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో.. పాక్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలని ఇటీవల గౌతమ్ గంభీర్ సూచించాడు. గంభీర్‌ వ్యాఖ్యలపై తాజాగా అఫ్రిది మాట్లాడుతూ ‘గంభీర్ లాంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా అవి..? బహిష్కరణ లాంటి మాటల ద్వారా దేశ ప్రజలకి ఏం అవగాహన కల్పిస్తారు..? నిజమే.. పుల్వామా ఉగ్రదాడి ఆమోదయోగ్యమైనది కాదు. అంతమాత్రానా.. పాక్‌తో మ్యాచ్‌ని బహిష్కరిస్తారా..? ఇప్పటికే పాక్‌తో భారత్‌ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు. ఇకపై ఆసియా కప్‌లో కూడా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడకపోవడం మంచిదేమో..?’ అని అఫ్రిది వెల్లడించాడు.