బీఎస్‌ఎన్‌ఎల్‌ రంజాన్ ఆఫర్స్

SMTV Desk 2019-05-25 22:10:11  bsnl Ramdaan offers

రంజాన్ సందర్భంగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న రూ.899 ప్లాన్‌ను రూ.786కే అందిస్తోంది. ఈ పాక్‌ ద్వారా దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌లకు 180 రోజుల పాటు అపరిమిత ఉచిత కాల్స్‌ మాట్లాడుకోవచ్చని సంస్థ వెల్లడించింది. ముంబై, ఢిల్లీ నగరాలలో తప్ప మిగిలిన అన్ని ప్రాంతాలకు రోమింగ్‌ సౌకర్యం కల్పించింది. ఈ ప్యాక్‌ ద్వారా ప్రతి రోజు 1.5 జీబీ ఉచిత హైస్పీడ్‌ డేటాతో పాటు 50 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు అదనంగా వర్తిస్తాయి. ఈ ఆఫర్‌ని జూన్‌ 5 వరకు వినియోగదారులు వినియోగించుకపోవచ్చు.