కేసీఆర్‌ అత్తగారి ఊర్లో విజయం............. బీజేపీమయం

SMTV Desk 2019-05-25 18:02:05  kcr

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామం కేసీఆర్‌ అత్త గారి ఊరు. ఎంపీ సంతోష్‌ కుమార్‌ స్వగ్రామం. ప్రతి ఎన్నికల్లోనూ కేసీఆర్‌ మర్యాదను కాపాడుతూ కొదరుపాక గ్రామస్థులు టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టేవారు. కానీ, తాజా లోక్‌సభ ఎన్నికల్లో వారు అనూహ్యంగా బీజేపీకి జై కొట్టారు. ఇక్కడ 1,756 ఓటర్లు ఉండగా 1,736 ఓట్లు పోలయ్యాయి. ఇందులో బీజేపీకి 883, టీఆర్‌ఎ్‌సకు 663, కాంగ్రె్‌సకు 97 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ బీజేపీకి 220 ఓట్ల ఆధిక్యం లభించింది. డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ టీఆర్‌ఎ్‌సకు 894 ఓట్లు, కాంగ్రె్‌సకు 827 ఓట్లు రాగా, బీజేపీకి 83 ఓట్లు మాత్రమే లభించాయి.