ఇకపై ఆఫ్ లైన్లో రియల్ మి3 ప్రో ఫోన్లు

SMTV Desk 2019-05-25 16:16:36  realme 3pro

ప్రముఖ మొబైల్ ఫోన్స్ తయారీ సంస్థ ఒప్పో సబ్ బ్రాండ్ రియల్ మి కి చెందిన రియల్ మి3 ప్రో ఫోన్లను ఇకనుండి ఆఫ్ లైన్లో కూడా విక్రయించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. Realme3ప్రో ఒప్పో నుంచి వచ్చి ప్రస్తుతం ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్లలో ఒకటి. సంస్థ ఇటీవలే దేశంలో రియల్మ్ 3 ప్రోని ప్రారంభించింది మరియు ఈ స్మార్ట్ ఫోన్ రూ.13.999 ధర వద్ద గత నెల ఏప్రిల్ 29 నుండి అమ్మకానికి ఉంది కానీ కేవలం ఆన్లైన్ Flipkart మరియు Realme వెబ్సైట్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ప్రస్తుతం 8,000 దుకాణాలలో దేశవ్యాప్తంగా ఆఫ్ లైన్ ద్వారా కొనుగోలు చేయడానికి వారి సరికొత్త ఫ్లాగ్ షిప్ అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. అమ్మకాలు మే 28 నుండి మొదలవుతుంది.Realme 3 ప్రో సోమవారం ఏప్రిల్ 29న ఇండియాలో మొదటి సారి అమ్మకాలు జరిగాయి. ముఖ్యంగా ఆ రోజు కంపెనీ రియల్ మి3 ప్రో 12pm (మధ్యాహ్నం) 4pm మరియు 8pm IST - మూడు వేర్వేరు సమయాలలో అమ్మకాలు జరిగాయి. శుక్రవారం నాడు ఒకటిన్నరకు ఫ్లాష్ అమ్మకాలలో రియల్ మి3ప్రో ఫోన్ అందుబాటులో ఉంటుంది అని తెలియడంతో ఈ రోజు 12 గంటల (మధ్యాహ్నం) IST షెడ్యూల్ సమయంలో మాత్రమే అమ్మకాలు జరిగాయి.